Posts

Showing posts from November, 2021

సగ్గు బియ్యము వడలు కావలసినవి .

Image
సగ్గు బియ్యము  వడలు .   కావలసినవి . సగ్గుబియ్యం  --  ఒక కప్పు బంగాళాదుంపలు -- రెండు . ముక్కలుగా  చేసి ఉడికించి పై తొక్క తీసి సిద్ధంగా  ఉంచుకోవాలి  బియ్యపు పిండి  --  ముప్పావు  కప్పు శనగపిండి  --  మూడు స్పూన్లు  తరిగిన  కరివేపాకు  --  పావు కప్పు   తరిగిన  పచ్చిమిర్చి  --  స్పూనున్నర అల్లం   కొద్దిగా   మెత్తగా  దంచి  అర  స్పూను సిద్ధంగా  ఉంచుకోవాలి .  జీలకర్ర   -  పావు  స్పూను   కారం  --   అర స్పూను  ఉప్పు  --  తగినంత  నూనె  --  350  గ్రాములు  ఉల్లిపాయలు --  రెండు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి . తయారీ  విధానము .  ఒక  గిన్నెలో  సగ్గుబియ్యం  వేసుకుని  తగినన్ని  నీళ్ళు  పోసుకుని   మూడు  గంటలు  సేపు  నానపెట్టుకోవాలి . ఆ తర్వాత  ఆ గిన్నెలో  ముప్పావు  కప్పు ...

పెసర ఆవకాయ.ఆవకాయ.

Image
పెసర ఆవకాయ. ఆవకాయ. ఉల్లి ఆవకాయ. శనగ ఆవకాయ. పెసరావకాయ. బెల్లపావకాయ. దప్పళపు ఆవకాయ. కాయావకాయ. పచ్చావకాయ. నువ్వావకాయ. మెంతికాయ. పులిహోర ఆవకాయ. మాగాయ. తొక్కుడు పచ్చడి. తురుము పచ్చడి. ఇలా రక రకాలైన ఆవకాయలను అన్ని  జిల్లాల వారు పెడతారు . ముఖ్యంగా ఏటికి ఏడాది నిల్వ  ఉండే   అవకాయ ,   ఉల్లి ఆవకాయ వంటివి ఎక్కువ  మోతాదులో , మిగిలినవి తక్కువ  మోతాదులో  పెట్టుకుంటారు.  ఇలా తక్కువ  మోతాదులో పెట్టుకునేది  ఈ పెసరావకాయ.  ఈ పెసరావకాయ  బాగా తాజాగా  ఓ మూడు నెలలు ఉంటుంది . తర్వాత  దీని రుచి క్రమంగా  తగ్గిపోతుంది .  అయితే కొత్తలో పెసరావకాయ రుచి  మహాద్భుతంగా  ఉంటుంది . నేను  ఈ పెసరావకాయ  కొలతలు షుమారుగా  మూడు మామిడి  కాయలకు చెబుతాను.   మీరు  ఎక్కువ  మోతాదులో పెట్టుకోదల్చిన  పక్షంలో కాయలను  బట్టి  మిగిలిన  దినుసులు  పెంచుకోండి. పెసరావకాయ. తయారీ విధానము. కావలసినవి. గుండ్రని పుల్లని మామిడి కాయలు -  3 చాయ పెసర పప్పు  -  250 గ్రాములు. ఎండుమిర...

స్వీట్ పొంగలి .తయారుచేయు విధానము .

Image
  స్వీట్  పొంగలి . తయారుచేయు   విధానము . ఒక  గిన్నెలో గ్లాసు  బియ్యం , పావు కప్పు చాయపెసరపప్పు  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోండి . అన్నం పూర్తిగా  ఉడకగానే షుమారు  ఓ  150  గ్రాముల  బెల్లం  పొడిగా   చేసి  ఉడుకుతున్న  అన్నం లో  వేయండి. అయిదు యాలకులు  మెత్తని పొడిగా  చేసి  ఉడుకుతున్న పొంగలి లో వేయండి. అందులో  మూడు స్పూన్లు  నెయ్యి కూడా వేసి గరిటెతో బాగా కలపండి. ఎండు కొబ్బరి  పావు చిప్ప తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరగండి. మరో  స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  ఎండు కొబ్బరి ముక్కలు,   పది  జీడిపప్పు పలుకులు  ,  పది కిస్ మిస్ లు వేయించి  పక్కన  పెట్టుకోండి . వేయించిన  ఎండు కొబ్బరి ముక్కలు , జీడిపప్పు  పలుకులు మరియు కిస్ మిస్ లు ఉడుకుతున్న పొంగలి లో వేసి గరిటెతో బాగా కలపండి. పరమాణ్ణంలో  బెల...

ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు

Image
ఈ  రోజు  స్పెషల్   ఐటం '  ముక్కల  పులుసు  '. రసం  ,  సాంబారు , పప్పు  పులుసు ,  పప్పు చారు  ఇలా  లిక్విడ్  ఐటమ్స్  లో  వివిధ  రకాలున్నా  ముక్కల  పులుసు  ది ప్రత్యేక  స్ధానం.  ప్రధమ  స్ధానం.  వెనుకటి  కాలం లో ప్రతి  శుభ కార్యాల లోనూ  ఈ  ముక్కల  పులుసును  తప్పనిసరిగా   చేసేవారు. తెలుగు  వారి  భోజనాలలో  నెయ్యి  వేసి  వేయించి  కందిపప్పు తో వండిన  ముద్ద పప్పు , పనస పొట్టు కూర , కొత్తావకాయ ,  ముక్కల పులుసు , కమ్మని నెయ్యి, మీగడ పెరుగు, కొనసీమ  కొత్తపల్లి  కొబ్బరి  మామిడి పండు  గొప్ప  కాంబినేషన్ . వేయి  రూపాయల  విందు  భోజనమైనా  ఈ  మెనూ  ముందు  దిగదుడుపే . మరి  ఈ  ముక్కల  పులుసు  తయారీ  విధానము  గురించి  తెలుసుకుందాం. కావలసినవి. ఆనపకాయ /  సొరకాయ  -- కాయలో  పావు  ముక్క . మంచ...

మామిడి కాయ తురుము పచ్చడి

Image
మామిడి  కాయ తురుము  పచ్చడి . మామిడి కాయ తురుము పచ్చడి  కూడా ఆవకాయ మాగాయల మాదిరిగానే  ఏడాది  నిల్వ పచ్చడిగా  పెట్టుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం  ఈ తురుము పచ్చడి  మూడు నెలలు  తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టుకుంటే మరో రెండునెలలు నిల్వ ఉంటుంది . మేము కేవలం రెండు పెద్ద కాయలు  ( జలాలు ) తురుము పచ్చడి గా పెట్టుకున్నాము. అందువలన నేను తురుము పచ్చడి కొలతలు రెండు కాయలకు  చెబుతున్నాను, మీరు ఎక్కువ  కాయలు తురుము పచ్చడి పెట్ట దల్చుకున్న పక్షంలో దాని ప్రకారము  కొలతలు  పెంచుకోండి. మామిడి  కాయ  తురుము పచ్చడి. ***************************** తయారు చేసే  విధానము. రెండు మామిడి  కాయలు శుభ్రంగా  కడిగి  పొడి గుడ్డతో  తుడుచుకుని , కాయలపై  పై  చెక్కు  తీసి ఎండు కొబ్బరి  కోరాముతో  తురుము కోవాలి. ఒక  బేసిన్  లో తురిమిన మామిడి  తురుము  తీసుకోవాలి . అందులో  ఒక ముప్పావు స్పూను  పసుపు మరియు  షుమారుగా  40  గ్రాముల  మెత్తని  ...

నువ్వుల పొడితో చింతపండు పులిహోర.

Image
నువ్వుల పొడితో చింతపండు   పులిహోర. కావలసినవి . చింతపండు   --  75 గ్రాములు  గింజలను  తీసుకుని గ్లాసున్నర  వేడినీటిలో  పదిహేను నిముషములు  నానబెట్టుకోవాలి . తదుపరి  వేరే గిన్నెలో  చిక్కగా రసం తీసుకోవాలి . నువ్వు పప్పు  --  50 గ్రాములు. నూనె  వేయకుండా  నాలుగు  ఎండుమిరపకాయలు వేసి  బాండిలో  వేయించుకుని  ఆ తర్వాత మిక్సీ లో  మెత్తని  పొడిగా  వేసుకోవాలి . ఈ పొడి  విడిగా  ఓ  ప్లేటులో  తీసుకుని ఉంచుకోవాలి . పచ్చిమిర్చి   --  పది . తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి . కరివేపాకు   --  ఎనిమిది   రెమ్మలు . బియ్యము   --  ఒకటిన్నర   గ్లాసు  పోపుకు . ఎండుమిరపకాయలు   --  పది పచ్చి శనగపప్పు   --  మూడు స్పూన్లు  మినపప్పు   --  రెండు  స్పూన్లు  ఆవాలు  --  స్పూను  పల్లీలు  ---   నాలుగు  స్పూన్లు ఇంగువ  -- ...

పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు.

Image
పల్లీలు  అంటే  వేరుశనగ   గుళ్ళు . నువ్వుపప్పు  అనగా  తెల్లని  నువ్వు పప్పు. కావలసినవి . పల్లీలు  --  100  గ్రాములు . నువ్వు పప్పు  --  50  గ్రాములు ఎండు కొబ్బరి  --  అర చిప్ప. చాకుతో  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి . ఎండుమిరపకాయలు  --  15 జీలకర్ర  --  స్పూనున్నర   ఉప్పు  --  తగినంత  తయారీ విధానము . ముందుగా     స్టౌ  మీద  బాండి  పెట్టి  నూనె  వేయకుండా  పల్లీలను కమ్మని వాసన  వచ్చేదాకా వేయించుకోవాలి . చల్లారగానే పల్లీల  పై పొట్టు  తీసి  విడిగా   ఉంచుకోవాలి . మళ్ళీ   స్టౌ మీద బాండి  పెట్టి  నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్ర  వేసుకుని  , నూనె   వేయకుండా    వేగిన  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి . చివరగా  బాండీలో ఎండు కొబ్బరి  ముక్కలు  కూడా వేసుకుని  కమ్మని  వాసన  వచ్చే...

చారు / రసము ఒట్టి వేడి నీళ్ళే కదా

Image
చారు  /  రసము  ఒట్టి  వేడి  నీళ్ళే  కదా !   అందులో  పోషక  విలువలేమున్నాయి  ?  అని  కొంత  మంది  అభిప్రాయం. కాని  పాత  తరం  పెద్ద  వాళ్ళు  తమ  పసి  పిల్లల  నెలల  వయసు  లోనే   అన్నం  బాగా  పేస్ట్ లా  వండి అందులో  నెయ్యి  బాగా  వేసి  చారు  వేసి  బాగా  గుజ్జులా  చేసి  చిన్న  చిన్న  గోరు  ముద్దలు  పెట్టేవారు . పసిపిల్లలకు   చాలా  తేలికగా   జీర్ణమయ్యేది  . అలా  క్రమ  క్రమంగా  అందులోనే  మెత్తని   పప్పు  కలిపి  తినిపించేవారు . ఈ  కాలంలో  లా  చంటి పిల్లలకు  Cerlac  లు  అవి  ఆ  కాలంలో  లేవు కదా ! పెద్దలందరు కూడా  రోజు  భోజనము లో  చారు  చేర్చుకోవడం  జీర్ణ వ్యవస్ధకు  చాలా  మంచిది .   ఇక  చారు  తయారీ  విధానము ....

నీర్ దోశె తయారీ విధానము .

Image
నీర్  దోశె. . తయారీ  విధానము . మనం  అన్నం వండుకునే  మామూలు  బియ్యము  ఒక కప్పు తీసుకుని  అందులో  మునిగే వరకు  నీళ్ళు  పోసి  ఐదు  గంటలు  నాన బెట్టు కోవాలి. పచ్చి కొబ్బరి అర చిప్ప తీసుకుని  కొబ్బరి  కోరాముతో  తురుముకోవాలి. తర్వాత  నీరు వడకట్టి  మిక్సీ లో కాని  గ్రైండర్ లో కాని నానబెట్టిన  బియ్యము  మరియు  పచ్చి కొబ్బరి తురుమును  వేసుకుని  అందులో తగినన్ని   నీళ్ళు పోసుకుని దోశెల పిండిలా కాటుకలా మెత్తగా  రుబ్బు కోవాలి. రుబ్బిన  పిండిని  ఒక గిన్నెలోకి  తీసుకుని  అందులో  కొద్దిగా  ఉప్పును  వేసుకుని , అవసరమయితే పిండిలో మరి కొన్ని  నీళ్ళు  పోసుకుని , గరిటెతో  బాగా కలుపుకుని , పిండిని  బాగా  గరిటె  జారుగా ఉండేటట్లుగా  చేసుకోవాలి. తర్వాత  స్టౌ  మీద  పెనం కాని  పాన్  కాని  పెట్టుకుని , పెనం  బాగా  కాలనివ్వాలి. తర్వాత పెనం లేదా  పాన్  పైన అర  స్...

కల్పవృక్షం..! మునగ.

Image
కల్పవృక్షం..!   మునగ. మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.   భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.   ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి ...

తమిళనాడు పొంగల్ . ( Ven Pongal )

Image
తమిళనాడు  పొంగల్ . (  Ven  Pongal  ) తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు. పొంగల్  చేస్తారు . దీన్నే  వారు  Ven Pongal అని అంటారు. కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్యరిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు . ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది . ఇంక  పొంగల్  తయారు  చేయడానికి కావలసినవి . బియ్యము  --  ఒక  గ్లాసు  చాయపెసరపప్పు  --  అర  గ్లాసు  మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను . నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు. ఉప్పు  --   తగినంత  అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను  జీలకర్ర   --  అర  స్పూను . జీడిపప్పు  ---  30  గ్రాములు  కరివేపాకు   -  మూడు  రెమ్మలు   పచ్చిమిర...

వంకాయ పచ్చి పులుసు

Image
వంకాయ పచ్చి పులుసు . కావలసినవి .  లేత  నీలం  లేదా  తెలుపు రంగు గుండ్రని వంకాయలు  --  మూడు . ఉల్లిపాయలు  --  రెండు పచ్చి మిరపకాయలు  --  అయిదు చింతపండు  --  నిమ్మ కాయంత. కరివేపాకు  --  రెండు  రెమ్మలు కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట ఉప్పు  --  తగినంత  పసుపు  --  కొద్దిగా  పోపునకు . నూనె  --   మూడు స్పూన్లు  ఎండు మిరపకాయలు  --  4 మినపప్పు  --  స్పూను జీలకర్ర  -  పావు స్పూను ఆవాలు  --  అర స్పూను. ఇంగువ  --  తగినంత . తయారీ  విధానము . ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసున్నర రసం  పల్చగా  తీసుకోవాలి . వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  పెట్టుకుని   సన్నని సెగలో  కాల్చుకోవాలి...

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర చట్నీతో .కొత్తిమీర చట్నీ.

Image
వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో . కొత్తిమీర  చట్నీ. తయారీ విధానము . ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత   ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకోవాలి.  పచ్చడిని  ఒక గిన్నెలోకి  తీసుకోవాలి . పచ్చడిలో ఒక కాయ నిమ్మరసం పిండుకోవాలి . తర్వాత  స్టౌ మీద పోపు  గరిటె  పెట్టుకుని  రెండు  స్ఫూన్లు నెయ్యి  వేసుకుని , నెయ్యి  బాగా కాగగానే ,  అందులో రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు కొద్దిగా  ఇంగువ వేసుకుని  పోపు పెట్టుకొని , పోపును  పచ్చడిలో  కలుపుకోవాలి.

టమోటో పులుసు పచ్చడి.కావలసినవి

Image
టమోటో  పులుసు పచ్చడి. కావలసినవి . పండి  గట్టిగా  ఉన్న టమోటోలు  -   4 ఉల్లిపాయలు    -  3 పచ్చిమిర్చి  -   6 కొత్తిమీర   -  ఒక చిన్న కట్ట  పసుపు  --  కొద్దిగా . చింతపండు  -  నిమ్మకాయంత ఉప్పు  -  తగినంత . పోపుకు . నూనె  -  నాలుగు  స్పూన్లు . ఎండుమిర్చి  -   3 .  ముక్కలుగా  చేసుకోవాలి. చాయమినపప్పు  - స్పూను . జీలకర్ర  -  పావు స్పూను. ఆవాలు -  అర  స్పూను  ఇంగువ  -  కొద్దిగా  కరివేపాకు  -  రెండు రెమ్మలు. తయారీ విధానము . ముందుగా  చింతపండు  విడదీసి  శుభ్రం చేసుకుని  పావు గ్లాసు వేడి  నీళ్ళల్లో   పావు గంట సేపు  నాన బెట్టుకుని  చిక్కగా  రసం తీసుకోవాలి . కొత్తిమీర   విడదీసి  శుభ్రం  చేసుకోవాలి. ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగుకుని  విడిగా  వేరే ప్లేటులో  ఉంచుకోవాలి. టమోటోలు  ముక్కలుగా...

కాకరకాయ కాయల పళంగా వేపుడు తయారీ విధానము

Image
కాకరకాయ కాయల పళంగా వేపుడు . తయారీ విధానము . అర కిలో  కాకరకాయలు  తీసుకుని  కాయ మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి. గింజలు తీయనవసరం లేదు. నూనెలో వేగాక  గింజలు  రుచిగా  ఉంటాయి . మిక్సీలో బాగా ఎండిన ఎండుమిరపకాయలు 15 , జీలకర్ర  స్పూనున్నర  , సరిపడా ఉప్పు , ఎనిమిది  వెల్లుల్లి  రెబ్బలు  వేసుకుని  కారం మెత్తగా  వేసుకోవాలి . వెల్లుల్లి  ఇష్టపడని వారు  రెండు స్పూన్లు జీలకర్ర  వేసుకుని  కారము మిక్సీ  వేసుకోవచ్చు . ఈ కారం విడిగా సీసాలోకి తీసుకోవాలి . మూడు నాలుగు సార్లకు  వస్తుంది . స్టౌ మీద బాండీ  పెట్టి  ఓ 150 గ్రాముల  నూనె వేసి , ముందుగా  సిద్ధం చేసుకున్న కాకరకాయలు  వేసుకుని  ఎర్రగా  వేయించుకోవాలి . తర్వాత  కాయలు విడిగా ప్లేటులో తీసుకుని  పైన చెప్పిన కారము కాయలలో కూరి వేడి వేడి నూనె రెండు స్పూన్లు  చొప్పున  కాయలలో వేసుకోవాలి . అంతే ఎంతో రుచిగా  ఉండే కాకరకాయ  కాయల పళంగా వేపుడు  సర్వింగ్ కుసిద్ధం. వేడి  వేడి  అన్నంల...

కాప్సికమ్ కాయలపళంగా కూర పొడి కూరిన Stuffed Curry.

Image
కాప్సికమ్   కాయలపళంగా కూర పొడి కూరిన Stuffed  Curry. కావలసినవి. కాప్సికమ్ చిన్న సైజు కాయలు -  350 గ్రాములు. ఎండుమిరపకాయలు  --  12 పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు  చాయమినపప్పు  --  రెండు స్పూన్లు  జీలకర్ర  -- ముప్పావు  స్పూను  ఆవాలు - కొద్దిగా  నూనె --  ఎనిమిది  స్పూన్లు  పెద్ద ఉల్లిపాయలు  --  రెండు. ఉప్పు  --  తగినంత  తయారీ విధానము . ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసుకుని  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర మరియు పావు స్పూను  ఆవాలు వేసుకుని  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి . చల్లారగానే  వేయించిన పోపు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  కొంచెం  పప్పులు  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి. ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఈ పొడి  వేరే పళ్ళెము లోకి  తీసుకోవాలి . చిన్న ముక...

కొబ్బరిఉండలు తయారి విధానం

Image
కొబ్బరిఉండలు . కావలసినవి   . పచ్చి కొబ్బరి   తురుము  --  మూడు  కప్పులు. బెల్లం  పొడి  --  ఒకటిన్నర  కప్పు . నెయ్యి  --  అయిదు  స్పూన్లు  జీడిపప్పులు  --  15 యాలకులు పొడి  --  అర  స్పూను . ముందుగా స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి  బాగా కాగగానే   జీడిపప్పు   వేయించి  పక్కన  పెట్టు కోవాలి . అదే  నెయ్యి  బాండీ  లో  పచ్చి  కొబ్బరి  తురిమినది వేసుకుని  పచ్చి  వాసన పోయి  కమ్మని  వాసన  వచ్చేదాక  వేయించుకొని  పక్కన  పెట్టు కోవాలి . తర్వాత  మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టుకొని  బెల్లం   పొడి  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి  బెల్లం తీగ  పాకం  ( చేతితో  అంటుకుంటే  తీగలా  సాగే  విధంగా  )  రానిచ్చి  అందులో  వేయిం...

చింత చిగురు కూర. ఎలా చేస్తారో తెలుసుకుందాం

Image
  చింత  చిగురు  కూర.   ఎలా  చేస్తారో  తెలుసుకుందాం . ముందుగా  చింత చిగురు  రెండు  చేతులతోను  నలిపి  అందులో  ఈనెలు  తీసేసుకోండి .   రెండు చేతులతోను  నలుపుతాము  కాబట్టి  ఆకు  కూడా నలిగి  దగ్గర పడుతుంది. మూడు  పెద్ద  ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా  సన్నగా తరుగుకోండి. ఇప్పుడు  స్టౌ వెలిగించి  బాండీ  పెట్టి  మూడు  స్పూనుల  నూనె  వేయండి. నూనె  బాగా  కాగాక  అందులో  మూడు ఎండు మిరపకాయలు  ముక్కలుగా  తుంపి వేయండి . ఆ తర్వాత  అందులో  ఒక స్పూన్  చాయ మినపప్పు , కొద్దిగా   జీలకర్ర  ,  కొద్దిగా  ఆవాలు , కొద్దిగా   ఇంగువ , తగినంత  కరివేపాకు   వేసి  పోపు  వేగాక  తరిగి  ఉంచుకున్న  ఉల్లిపాయ  ముక్కలు  వేసి  , కాస్త పసుపు వేసి  మూత పెట్టండి. ఒక  అయిదు  నిముషాలు  అయ్యాక  ఉల్లిపాయ  ముక్కలు  మె...

సగ్గు బియ్యం పకోడీలు.

Image
సగ్గు బియ్యం పకోడీలు . కావలసినవి . సగ్గుబియ్యం -- ఒకటిన్నర కప్పు ఉల్లిపాయలు -- రెండు పచ్చిమిరపకాయలు -- 8 అల్లం -- చిన్న ముక్క కొత్తిమీర -- అర కట్ట  కరివేపాకు -- రెండు రెమ్మలు  ఉప్పు -- తగినంత  నూనె -- పావు కిలో  మజ్జిగ --- రెండు గ్లాసులు . బియ్యపు పిండి -- నాలుగు  స్పూన్లు . మైదా పిండి --- మూడు స్పూన్లు తయారీ విధానము . ఈ సగ్గుబియ్యం పకోడీలు తయారు చేయుటకు మూడు గంటల ముందు మజ్జిగ లో సగ్గు బియ్యాన్ని నాన బెట్టాలి . సగ్గు బియ్యము మజ్జిగలో బాగా నాని ఉబ్బుతాయి . ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి . మిక్సీలో అల్లం పచ్చి మిర్చి మెత్తగా వేసుకోవాలి . ఇప్పుడు నానిన సగ్గు బియ్యము లో బియ్యపు పిండి , మైదా పిండి , ఉల్లిపాయల ముక్కలు , కరివేపాకు , పావు స్పూను జీలకర్ర తరిగిన కొత్తిమీర , అల్లం పచ్చి మిర్చి మిశ్రమం మరియు తగినంత ఉప్పువేసి నీళ్ళు అవసరమయితే పోసుకుని పకోడీల పిండిలా చేత్తో బాగా కలుపు కోవాలి . ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే పకోడీల మాదిరిగా వేసి బంగారు రంగులో వేగాక వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

మైసూర్ బజ్జీ తయారీ విధానము

Image
 , మైసూర్  బజ్జీ . తయారీ  విధానము . ఒక అర  కప్పు  పుల్లని  పెరుగులో  ఒక కప్పు  మైదా పిండి ,  రెండు  స్పూన్లు   బియ్యపు పిండి, పావు స్పూను  జీలకర్ర ,  తగినంత  ఉప్పు , కొద్దిగా  వంట సోడా  వేసి  బాగా  కలుపు కోవాలి . అయిదు  పచ్చిమిరపకాయలు  మరియు  చిన్న అల్లం  ముక్కరోటిలో  దంచుకుని లేదా మిక్సీ లో వేసుకుని   పిండిలో  కలుపుకోవాలి . పిండి  గట్టిగా  ఉంటే  కొద్దిగా   నీళ్ళు పోసి  కలుపుకోవాలి . పది నిముషముల  తర్వాత స్టౌ  మీద  బాండీ  పెట్టి షుమారు పావు కిలో   నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే  చేతితో  లేదా  స్పూనుతో బజ్జీల  లాగా  వేసుకోవాలి . అవి  బంగారు  రంగులో  వేగనివ్వాలి, అంతే  మధ్యాహ్నము   అల్పాహారానికి  వేడి  వేడి  మైసూరు  బజ్జీ  సిద్ధం . ఇవి  అప్పటికప్పుడు  వేసుకుని  వేడి వేడిగా  తింట...

చలిమిడి తయారీ విధానం

Image
చలిమిడి  తయారీ విధానం చలిమిడి  తయారు చేయు  విధానము . కావలసినవి . బియ్యము   --  ఒక  కె. జి . బెల్లం   --   ముప్పావు  కిలో గసగసాలు  --  రెండు  స్పూన్లు . స్టౌ  మీద బాండి పెట్టి  స్పూను  నెయ్యి వేసుకుని నెయ్యి  కాగగానే  గసగసాలు వేసుకుని  వేయించుకుని   విడిగా  తీసుకోవాలి . గసగసాలు చలిమిడి లో వేయడానికి  ఇష్ట పడని వారు  గసగసాలు  వేయకుండా  చలిమిడి  తయారు  చేసుకొనవచ్చును .  శుభ సందర్భాలలో నువ్వుపప్పు వాడరు . అందువలన నువ్వుపప్పు  చలిమిడి లో  వేయరు.     ఎండు కొబ్బరి  --  ఒక చిప్ప.    చిన్న ముక్కలుగా  తరిగి స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి ,  నెయ్యి బాగా కాగగానే  తరిగిన  కొబ్బరి ముక్కలు   వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ముక్కలను  విడిగా ఒక  ప్లేటులో కి  తీసుకోవాలి. ల...

నిమ్మకాయ ఊరగాయ తయారివిధానం

Image
నిమ్మకాయ  ఊరగాయ. కావలసినవి. గుండ్రని పసుపు పచ్చని ,  పై తొక్క పలుచగా ఉన్న నిమ్మకాయలు -     20 పసుపు  -  స్పూనున్నర  మెత్తని ఉప్పు  -   షుమారుగా  150 గ్రాములు. కారం   -  షుమారుగా  125  గ్రాములు. మెంతి పిండి  - రెండున్నర  స్పూన్లు . (  30  గ్రాముల మెంతులను  బాండీలో నూనె  వేయకుండా  బాగా  వేయించి  చల్లారిన తర్వాత  మిక్సీ లో  మెత్తని  పొడిగా  వేసుకుని  ఒక సీసాలో  వేసుకోవాలి. ) ఈ పొడి  మరో రెండు మూడుసార్లకు  వస్తుంది. తయారీ విధానము. ముందుగా  నిమ్మ కాయలు  తడి గుడ్డతో  శుభ్రంగా  తుడుచుకుని ఓ పది నిముషాలు  నీడన  ఆర  నివ్వాలి. అందులో  15  నిమ్మ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి. ఒక అయిదు  నిమ్మ కాయలు  రసం ఒక  గిన్నెలో  వేరుగా తీసుకోవాలి . ఒక  బేసిన్ లో తరిగిన  నిమ్మకాయ ముక్కలు వేసుకుని  అందులో  విడిగా గిన్నెలోకి తీసిన నిమ్మరసం ముక్కలలో పోస...

నిమ్మకాయకారం ( పాత తరం పద్థతిలో )

Image
నిమ్మకాయ  కారం .  (  పాత తరం పద్థతిలో ) ************************************* ప్రియమిత్రులందరికీ  ఈ  రోజున  మీ  అందరికీ   నోట్లో  నీరు  ఊరించే  నిమ్మకాయ  కారం గురించి తెలియ చేస్తాను . ఈ  నిమ్మకాయ  కారం  చేయడానికి  కావలసిన  పదార్ధములు . పసుపు  రంగు  వచ్చిన  నిమ్మకాయలు  -   నాలుగు ఎండు మిర్చి   ---   15 నూనె  --  మూడు  స్పూన్లు  పసుపు  --  పావు స్పూనులో సగం ఉప్పు   ---  తగినంత  పోపుకు  కావలసినవి . పొట్టు మినపప్పు   అయితే  మంచిది . లేకపోతే  చాయమినపప్పు   వాడండి. మినపప్పు  ---  మూడు స్పూన్లు  ఆవాలు  --  ఒక  స్పూను  మెంతులు  --  ఒకటిన్నర  స్పూను  ఇంగువ  --  తగినంత  (  కాస్త ఎక్కువ  ) ఈ  నిమ్మకాయ కారం  మిక్సీలో  కంటే  రోట్లో పచ్చడి బండతో  నూరుకుంటే  తి...

కరివేపాకు రోటి పచ్చడి .తయారీ విధానము

Image
కరివేపాకు రోటి పచ్చడి . తయారీ  విధానము   . ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు  నూనె  వేసుకుని నూనె బాగాకాగగానే  , రెండు కప్పుల కరివేపాకు  , 50  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పన్నెండు  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా వేసుకుని పోపు వేయించుకోవాలి.   నిమ్మకాయంత  చింతపండు   వేడి నీళ్ళలో  పావు గంట సేపు   నాన బెట్టు కొని    చిక్కగా  రసం  తీసుకోవాలి .   పోపు చల్లారగానే  రోటి లో  ముందు  వేయించిన   ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు కొద్దిగా  పసుపును వేసుకుని   పచ్చడి బండతో దంపుకోవాలి .   ఆ  తర్వాత  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం , చింతపండు  రసం మరియు తీపి  ఇష్టమైన వారు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం కొంచెం   నీరు  ...

కరివేపాకు వెల్లుల్లి పచ్చడి.తయారీ విధానము

Image
కరివేపాకు వెల్లుల్లి  పచ్చడి. తయారీ విధానము. స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె  వేసుకుని  నూనె బాగా కాగగానే  వరుసగా  పది ఎండుమిరపకాయలు  , మూడు స్పూన్లు  ధనియాలు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర  , అర స్పూను ఆవాలు , అర కప్పు కరివేపాకు  మరియు  20  పై పొట్టు తీసిన వెల్లుల్లి  రెబ్బలు  వేసుకుని  పోపును  వేయించుకోవాలి. తర్వాత  ఈ పోపును మిక్సీలో వేసుకుని , అందులో  గోలి కాయంత చింతపండు  మరియు తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకోవాలి. ఈ పచ్చడి  వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని  తింటే ఎంతో రుచిగా ఉంటుంది . ఋతువులు మారినప్పుడు ఉదరంలో  ఏర్పడే సమస్యలకు  దివ్యమైన  ఔషధం. ఈ పచ్చడి  వెల్లుల్లి  ప్రియులకు మాత్రమే .

కరివేపాకు వెల్లుల్లి పచ్చడి

Image
కరివేపాకు  వెల్లుల్లి  పచ్చడి. ఈ  కరోనా  కాలంలో  మన శరీరంలో  రోగ నిరోధక  శక్తి  వృద్ధి  చెందడానికి  మధ్య మధ్యలో  వెల్లుల్లి  కూడా  ఆహారంలో  తీసుకోవడం  మంచిది . జీర్ణ శక్తి  కూడా వృద్ధి  చెందుతుంది. సీజన్  మారినప్పుడు  ఇలా  వెల్లుల్లి  , జీలకర్ర  మరియు కరివేపాకు  వంటివి  తీసుకుంటే దగ్గు , జలుబు  వంటి  అనారోగ్యాలకు  దూరంగా  ఉంచుతుంది.  ప్రస్తుతం  వానాకాలం  నడుస్తోంది.కావున జలుబు దగ్గు  వంటి  అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే  ఈ పచ్చడిని  చేసుకుని  తినండి. కావలసినవి. ఎండుమిరపకాయలు  - 12. కరివేపాకు  -  అర కప్పు. వెల్లుల్లి  రెబ్బలు -  పై పొట్టు  వలిచినవి   25 చింతపండు  - రెండు రెబ్బలు . చాయమినపప్పు  / పొట్టు  మినపప్పు   -  రెండు  స్పూన్లు  జీలకర్ర   -  స్పూను. ఆవాలు  -   స్పూను. నూనె  -  మూడు స్పూన్లు...