సగ్గు బియ్యము వడలు కావలసినవి .


సగ్గు బియ్యము  వడలు .
 
కావలసినవి .

సగ్గుబియ్యం  --  ఒక కప్పు
బంగాళాదుంపలు -- రెండు . ముక్కలుగా  చేసి ఉడికించి పై తొక్క తీసి సిద్ధంగా  ఉంచుకోవాలి 
బియ్యపు పిండి  --  ముప్పావు  కప్పు
శనగపిండి  --  మూడు స్పూన్లు 
తరిగిన  కరివేపాకు  --  పావు కప్పు  
తరిగిన  పచ్చిమిర్చి  --  స్పూనున్నర
అల్లం   కొద్దిగా   మెత్తగా  దంచి  అర  స్పూను సిద్ధంగా  ఉంచుకోవాలి . 
జీలకర్ర   -  పావు  స్పూను  
కారం  --   అర స్పూను 
ఉప్పు  --  తగినంత 
నూనె  --  350  గ్రాములు 
ఉల్లిపాయలు --  రెండు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

తయారీ  విధానము . 

ఒక  గిన్నెలో  సగ్గుబియ్యం  వేసుకుని  తగినన్ని  నీళ్ళు  పోసుకుని   మూడు  గంటలు  సేపు  నానపెట్టుకోవాలి .

ఆ తర్వాత  ఆ గిన్నెలో  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి , శనగపిండి ,  ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ,  సన్నగా  తరిగిన ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కొత్తిమీర  , సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి ,  జీలకర్ర  , కొద్దిగా  దంచిన  అల్లం , కారం  మరియు  తగినంత  ఉప్పు వేసి  కొద్దిగా   నీళ్ళు పోసుకుని  పిండిని  వడలు  వేసే  విధంగా  కలుపుకోవాలి .

ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   పిండిని  చిన్న  చిన్న  వడల్లా  చేతితో  తట్టి   వేసుకోవాలి .
 .
అంతే . ఎంతో  రుచిగా  ఉండే  సగ్గు బియ్యము  వడలు  అల్పాహారమునకు  సిద్ధం.

Comments