స్వీట్ పొంగలి .తయారుచేయు విధానము .

 
స్వీట్  పొంగలి .
తయారుచేయు   విధానము .

ఒక  గిన్నెలో గ్లాసు  బియ్యం , పావు కప్పు చాయపెసరపప్పు  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోండి .

అన్నం పూర్తిగా  ఉడకగానే షుమారు  ఓ  150  గ్రాముల  బెల్లం  పొడిగా   చేసి  ఉడుకుతున్న  అన్నం లో  వేయండి.

అయిదు యాలకులు  మెత్తని పొడిగా  చేసి  ఉడుకుతున్న పొంగలి లో వేయండి.

అందులో  మూడు స్పూన్లు  నెయ్యి కూడా వేసి గరిటెతో బాగా కలపండి.

ఎండు కొబ్బరి  పావు చిప్ప తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరగండి.

మరో  స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  ఎండు కొబ్బరి ముక్కలు, 
 పది  జీడిపప్పు పలుకులు  ,  పది కిస్ మిస్ లు వేయించి  పక్కన  పెట్టుకోండి .

వేయించిన  ఎండు కొబ్బరి ముక్కలు , జీడిపప్పు  పలుకులు మరియు కిస్ మిస్ లు ఉడుకుతున్న పొంగలి లో వేసి గరిటెతో బాగా కలపండి.

పరమాణ్ణంలో  బెల్లం  పూర్తిగా  కలిసిపోయి  పూర్తిగా  ఉడకగానే  దింపి  , అర లీటరు బాగా కాచిన పాలు పోసి  గరిటెతో  బాగా కలపండి .

ఎందుకంటే  ఉడుకుతున్న బెల్లం అన్నంలో  పాలు పోస్తే పరమాణ్ణం విరిగే అవకాశం ఉంది .

ఇదే పొంగలి  బెల్లం  బదులుగా  షుమారుగా  100  గ్రాములు పంచదార వేసుకుని  ఇదే పద్థతిలో చేసుకొనవచ్చును .

అంతే . స్వీట్  పొంగలి  నైవేద్యానికి  మరియు  సర్వింగ్ కు సిద్ధం.

Comments