మైసూర్ బజ్జీ తయారీ విధానము
,
మైసూర్ బజ్జీ .
తయారీ విధానము .
ఒక అర కప్పు పుల్లని పెరుగులో ఒక కప్పు మైదా పిండి , రెండు స్పూన్లు బియ్యపు పిండి, పావు స్పూను జీలకర్ర , తగినంత ఉప్పు , కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపు కోవాలి .
అయిదు పచ్చిమిరపకాయలు మరియు చిన్న అల్లం ముక్కరోటిలో దంచుకుని లేదా మిక్సీ లో వేసుకుని పిండిలో కలుపుకోవాలి .
పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి .
పది నిముషముల తర్వాత
స్టౌ మీద బాండీ పెట్టి షుమారు పావు కిలో నూనె పోసి నూనె బాగా కాగగానే చేతితో లేదా స్పూనుతో బజ్జీల లాగా వేసుకోవాలి .
అవి బంగారు రంగులో వేగనివ్వాలి,
అంతే మధ్యాహ్నము అల్పాహారానికి వేడి వేడి మైసూరు బజ్జీ సిద్ధం .
ఇవి అప్పటికప్పుడు వేసుకుని వేడి వేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Post a Comment