కాకరకాయ కాయల పళంగా వేపుడు తయారీ విధానము


కాకరకాయ కాయల పళంగా వేపుడు .
తయారీ విధానము .

అర కిలో  కాకరకాయలు  తీసుకుని  కాయ మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి.

గింజలు తీయనవసరం లేదు. నూనెలో వేగాక  గింజలు  రుచిగా  ఉంటాయి .

మిక్సీలో బాగా ఎండిన ఎండుమిరపకాయలు 15 , జీలకర్ర  స్పూనున్నర  , సరిపడా ఉప్పు , ఎనిమిది  వెల్లుల్లి  రెబ్బలు  వేసుకుని  కారం మెత్తగా  వేసుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టపడని వారు  రెండు స్పూన్లు జీలకర్ర  వేసుకుని  కారము మిక్సీ  వేసుకోవచ్చు .

ఈ కారం విడిగా సీసాలోకి తీసుకోవాలి .

మూడు నాలుగు సార్లకు  వస్తుంది .

స్టౌ మీద బాండీ  పెట్టి  ఓ 150 గ్రాముల  నూనె వేసి , ముందుగా  సిద్ధం చేసుకున్న కాకరకాయలు  వేసుకుని  ఎర్రగా  వేయించుకోవాలి .

తర్వాత  కాయలు విడిగా ప్లేటులో తీసుకుని  పైన చెప్పిన కారము కాయలలో కూరి వేడి వేడి నూనె రెండు స్పూన్లు  చొప్పున  కాయలలో వేసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే కాకరకాయ  కాయల పళంగా వేపుడు  సర్వింగ్ కుసిద్ధం.

వేడి  వేడి  అన్నంలో  నెయ్యి  వేసుకుని  ఈ కూరతో  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

Comments