కరివేపాకు వెల్లుల్లి పచ్చడి.తయారీ విధానము
కరివేపాకు వెల్లుల్లి పచ్చడి.
తయారీ విధానము.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే వరుసగా పది ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు ధనియాలు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , అర కప్పు కరివేపాకు మరియు 20 పై పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పోపును వేయించుకోవాలి.
తర్వాత ఈ పోపును మిక్సీలో వేసుకుని , అందులో గోలి కాయంత చింతపండు మరియు తగినంత ఉప్పును వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది .
ఋతువులు మారినప్పుడు ఉదరంలో ఏర్పడే సమస్యలకు దివ్యమైన ఔషధం.
ఈ పచ్చడి వెల్లుల్లి ప్రియులకు మాత్రమే .
Comments
Post a Comment