పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు.
నువ్వుపప్పు అనగా తెల్లని నువ్వు పప్పు.
కావలసినవి .
పల్లీలు -- 100 గ్రాములు .
నువ్వు పప్పు -- 50 గ్రాములు
ఎండు కొబ్బరి -- అర చిప్ప.
చాకుతో చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- స్పూనున్నర
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండి పెట్టి నూనె వేయకుండా పల్లీలను కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే పల్లీల పై పొట్టు తీసి విడిగా ఉంచుకోవాలి .
మళ్ళీ స్టౌ మీద బాండి పెట్టి నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు జీలకర్ర వేసుకుని , నూనె వేయకుండా వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చివరగా బాండీలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
చల్లారగానే వేయించిన పల్లీలు , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి ముక్కలు , ఎండుమిరపకాయలు , జీలకర్ర మరియు సరిపడే ఉప్పువేసి మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
అంతే. ఇడ్లీ , దోశెలు మరియు భోజనము లోకి రుచికరమైన పల్లీలు నువ్వుపప్పు పొడి సిద్ధం .
Comments
Post a Comment