కొబ్బరిఉండలు తయారి విధానం


కొబ్బరిఉండలు .

కావలసినవి  .
పచ్చి కొబ్బరి   తురుము  --  మూడు  కప్పులు.
బెల్లం  పొడి  --  ఒకటిన్నర  కప్పు .
నెయ్యి  --  అయిదు  స్పూన్లు 
జీడిపప్పులు  --  15
యాలకులు పొడి  --  అర  స్పూను .

ముందుగా స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి  బాగా కాగగానే   జీడిపప్పు   వేయించి  పక్కన  పెట్టు కోవాలి .

అదే  నెయ్యి  బాండీ  లో  పచ్చి  కొబ్బరి  తురిమినది వేసుకుని  పచ్చి  వాసన పోయి  కమ్మని  వాసన  వచ్చేదాక  వేయించుకొని  పక్కన  పెట్టు కోవాలి .

తర్వాత  మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టుకొని  బెల్లం   పొడి  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి  బెల్లం తీగ  పాకం  ( చేతితో  అంటుకుంటే  తీగలా  సాగే  విధంగా  )  రానిచ్చి  అందులో  వేయించిన  కొబ్బరి  తురుము  , యాలకుల  పొడి ,  వేయించిన  జీడిపప్పు  మరియు  రెండు  స్పూన్లు   నెయ్యి   వేసి  మరో  నాలుగు   నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

ఆ తర్వాత  వేడి  కొంచెం   చల్లారగానే  చేతికి  నెయ్యి  రాసుకుని  ఉండలు  కట్టు కోవాలి .

అంతే. ఎంతో  రుచిగా  ఉండే  బెల్లం  తో  చేసిన  కొబ్బరి   ఉండలు   సర్వింగ్ కు సిద్ధం.

Comments