సంబారు కారము .( Instant )తయారీ విధానము.
సంబారు కారము .
( Instant )
తయారీ విధానము.
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా రెండు స్పూన్లు ధనియాలు , స్పూను జీలకర్ర , అర స్పూను మెంతులు , స్పూను మినపప్పు , స్పూను శనగపప్పు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .
పదిహేను ఎండుమిరపకాయలు ఎండలో బాగా ఎండ నివ్వాలి . మిరపకాయలు బాండీలో వేయించనవసరం లేదు.
ఒక 20 వెల్లుల్లి రెబ్బలు పై చెక్కుతో సహా వలుచుకోవాలి.
వేయించిన దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ లో వేసుకుని అందులో తగినంత ఉప్పును మరియు అర స్పూను పసుపును వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
చివరలో వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీలో వేసుకుని మరోసారి మిక్సీ వేసుకోవాలి.
ఈ పొడిని ఒక బేసిన్ లో వేసుకుని అందులో స్పూనున్నర కాచని నూనె వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి.
తదుపరి ఈ పొడిని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.
ఈ పొడి కాస్త నోటిలో వేసుకుని రుచి చూసుకుంటే , నాలికకు ఉప్పగా తగలాలి.
అప్పుడు మనం వేపుడు కూరల్లో లేదా మామూలు కూరల్లో లేదా కాయల పళంగా చేసుకునే బెండకాయ , కాకరకాయ వంటి కూరల్లో వాడుకున్నా ఇంక అదనంగా ఉప్పు వేయవలసిన అవసరం ఉండదు.
https://jayakari.in/product-category/dining-table-needs/pickles/
ఈ విధముగా నేను చెప్పిన దినుసులను ఎక్కువ పాళ్ళలో వేసుకుని నూనె వేయకుండా బాండీలో విడివిడిగా వేయించుకుని , ఎండుమిరపకాయలు రెండు రోజులు ఎర్రని ఎండలో , ఎండ పెట్టుకుని , ఆ తర్వాత అన్నీ మిక్సీ లో వేసుకుని , ఓ నెలకు సరిపడా సంబారు కారము తయారు చేసుకొనవచ్చును .
Comments
Post a Comment