మెంతి బద్దలు.తయారీ విధానము .
మెంతి బద్దలు.
తయారీ విధానము .
ముందుగా ఒక పుల్లని మామిడికాయ పై చెక్కు తీసుకుని , చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. ముక్కలు పైన అర స్పూను పసుపు వేసుకోవాలి.
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు వేసుకుని నూనె బాగాకాగగానే , పదిహేను ఎండుమిరపకాయలు , ముప్పావు స్పూను మెంతులు , స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువను వేసుకుని పోపు వేయించుకోవాలి. పోపులో మెంతులు బాగా వేగాలి. లేకపోతే బద్దలు చేదు తగుల్తాయి.
పోపు చల్లారగానే మిక్సీ లో ఈ వేయించిన పోపు మరియు తగినంత ఉప్పును వేసుకుని మెత్తని పొడిగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత పొడిని ఒక పళ్ళెము లోకి తీసుకోవాలి . అందులో తరిగిన మామిడి కాయ ముక్కలు మరియు మూడు స్పూన్లు కాచని నూనెను వేసుకుని , ముక్కలను పొడిని చేతితో బాగా కలుపుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
ఒక గంట సేపు ఊరనివ్వాలి. తర్వాత వాడుకొనవచ్చును .
ఇష్టమైన వారు పోపు మిక్సీ వేసుకొనేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకొనవచ్చును .
పదిహేను రోజులు నిల్వ ఉంటుంది .
Comments
Post a Comment