పాలకూర పచ్చడి.... తయారీ విధానం
పాలకూర పచ్చడి....
కావలసినవి
పాలకూర: కట్ట(పెద్దది), నూనె: 3 టీస్పూన్లు, పచ్చిమిర్చి: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, పొడికోసం: పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, దనియాలు: టీస్పూను, నువ్వులు: టీస్పూను, చింతపండు: నిమ్మకాయంత, తాలింపుకోసం: నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: రెండు
తయారుచేసే విధానం
* పాలకూర బాగా కడిగి కోయాలి. బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి తీసి పాలకూర ఆకులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి.
* మరో పాన్‌లో పల్లీలు, జీలకర్ర, దనియాలు, నువ్వులు వేసి నూనె లేకుండా వేయించి తీయాలి. చల్లారాక పొడి చేయాలి.
* వేయించి తీసిన పచ్చిమిర్చి, చింతపండు, పాలకూర, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, దనియాల పొడి, ఉప్పు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
Comments
Post a Comment