రవ్వ దోసె తయారి విధానం
రవ్వ దోశె .
తయారీ విధానము .
ఒక కప్పు బియ్యపు పిండికి , పావు కప్పు మైదా పిండి , పావు కప్పు బొంబాయి రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి.
అందులో అర స్పూను జీలకర్ర , మూడు సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేసుకోవాలి.
తగినంత ఉప్పు వేయాలి.
పావు కప్పు మజ్జిగతో పాటు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ,మామూలు దోశె పిండి కన్నా కొంచెం పల్చగా చేసుకుని ఒక అరగంట సేపు అలా ఉంచాలి.
పూర్తిగా మజ్జిగతో కలిపితే దోశె పెనానికి అంటుకుంటుంది.
ఇక స్టౌ మీద పెనం పెట్టి పెనం బాగా కాగాక నూనె వేసి గరిటతో పెనం మధ్యన కాకుండా చివర నుండి చాకచక్యంగా చిల్లులు చిల్లుగా పోసుకుంటూ రావాలి.
ఇందులో తురిమిన కొబ్బరి , తురిమిన క్యారెట్ , జీడిపప్పు పలుకులు దోశెలపై వేసుకుని మరి కాస్త నూనె వేసుకుని కాల్చుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది.
మొదట ఒకటి రెండు దోశెలు అంత బాగా రాకపోయినా తర్వాత దోశెలు బాగానే వస్తాయి. కంగారు పడవద్దు. పెనం బాగా కాలిన కొద్దీ రవ్వదోశెలు బాగా వస్తాయి.
Comments
Post a Comment