దొండకాయ ఉల్లిపాయ వేపుడు
తయారు చేయు విధానము .
అరకిలో దొండకాయలు ముక్కలుగా తరుగు కోవాలి.
పావు కిలో ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి ఆరు స్పూన్లు నూనె వేసి , నూనెను బాగా కాగనిచ్చి దొండకాయ ముక్కలు మరియు ఉల్లిపాయల ముక్కలను బాండీలో వేసుకుని వేయించుకోవాలి .
దొండకాయ ముక్కలు మరియు ఉల్లిపాయల ముక్కలు వేగగానే సరిపడా ఉప్పు మరియు రెండు స్పూన్లు కారం వేసుకుని , మరో అయిదు నిముషాలు వేయించుకుని దింపుకుని , వేరే పళ్ళెంలో కి తీసుకోవాలి.
Comments
Post a Comment