కొబ్బరి పచ్చడి తయారీ విధానము .
కొబ్బరి పచ్చడి.
తయారీ విధానము .
ఒక కొబ్బరి కాయను పగుల కొట్టి రెండు చిప్పలను చాకుతో చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
ఒక చిన్న కొత్తిమీర కట్టను కడుగుకొని వేళ్ళు తీసి వేసి చాకుతో కట్ చేసుకుని ఉంచుకోవాలి.
ఐదు పచ్చి మిరపకాయలు తొడిమలు తీసుకుని ఉంచుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో ముక్కలుగా చేసిన కొబ్బరి ముక్కలు , పచ్చిమిరపకాయల ముక్కలు , తరిగిన కొత్తిమీర మరియు తగినంత ఉప్పునువేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకుని విడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు , పావు స్పూను జీలకర్ర , కొద్దిగా ఇంగువ మరియు మూడు రెమ్మలు కరివేపాకును వేసి పైన పోపు వేసుకుని స్పూను తో బాగా కలుపుకోవాలి.
ఈ విధముగా పచ్చడి పెద్ద పెద్ద హోటల్స్ లో చింతపండు వేయకుండా తయారు చేస్తారు.
ఈ పచ్చడి అన్నింటి లోకి ఇడ్లీలు , దోశెలు , గారెలు , పూరీలు , రోటీలు , చపాతీలు లోకిచాలా రుచిగా ఉంటుంది .
భోజనము లోకి అయిన పక్షంలో పచ్చడిలో రెండు రెమ్మలు చింతపండు వేసుకుని మిక్సీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది .
లేదా ఒక కాయ నిమ్మరసం పిండు కొనవచ్చును.
Comments
Post a Comment