వంకాయ కొత్తిమీర కారం

వంకాయ  కొత్తిమీర  కారం.

తయారీ విధానము.

అర కిలో  వంకాయలు  తీసుకోవాలి. ఒక గిన్నెలో  నీళ్ళు  పోసుకుని  అందులో  అర  స్పూను  ఉప్పు  వేసుకుని , వంకాయలను  ముక్కలుగా  తరుగుకోవాలి.

ఒక పెద్ద కట్ట కొత్తిమీర  తీసుకుని  శుభ్రం చేసకుని  ఉంచుకోవాలి.  తర్వాత  మిక్సీలో  పన్నెండు  పచ్చిమిరపకాయలు , మొత్తం కొత్తిమీర  మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ వేసుకోవాలి.  ఈ ముద్దను  విడిగా ఓ ప్లేటులోకి  తీసుకుని  ఉంచుకోవాలి.

స్టౌ మీద  గిన్నెను  పెట్టుకుని ఆరు  స్పూన్లు  నూనెను  వేసుకుని  నూనె కాగగానే  ముక్కలను  వేసుకొని  పది నిముషాలు  ముక్కలను బాగా  మగ్గనివ్వాలి.

దింపబోయే  ఐదు నిముషాల  ముందు  ఈ  మిశ్రమాన్ని  మగ్గిన  కూరలో వేసుకుని  ఓ  ఐదు నిముషాలు  మిశ్రమాన్ని  మగ్గనిచ్చి  దింపుకుని , వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

Comments