కరివేపాకు వెల్లుల్లి కారప్పొడి


కరివేపాకు  వెల్లుల్లి  కారప్పొడి.

దేశమంతా  విపరీతమైన  వానలు.  మళ్ళీ  జలుబు , దగ్గు మరియు  ఉదరంలో  అసౌకర్యం  వంటివి మనకు కలగకుండా  ఉండాలంటే  కాస్త శరీరానికి  వెల్లుల్లి  తగలాల్సిందే. అందుకు  ఉత్తమమైన  మార్గం  ఈ కరివేపాకు  వెల్లుల్లి  కారప్పొడి.

వేడి  వేడి  అన్నంలో మొదటి  ఐటమ్ గా  రెండు  స్పూన్లు  ఈ కరివేపాకు  వెల్లుల్లి  కారప్పొడి  వేసుకుని  అందులో  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉండటమే  కాకుండా  పై సమస్యలన్నీ  దరిచేరవు.

తయారీ విధానము.

స్టౌ మీద బాండీ పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  పది  ఎండు మిరపకాయలు  , కప్పు ధనియాలు , స్పూనున్నర  మినపప్పు , పావు స్పూను  జీలకర్ర  , పావు స్పూను  ఆవాలు మరియు  కప్పు కరివేపాకును  వేసుకొని  పోపు వేయించుకోవాలి.
పోపు  చల్లారగానే  ఈ పోపును  మిక్సీలో వేసుకుని  అందులో  ఉసిరికాయ అంత చింతపండు , తగినంత  ఉప్పును వేసుకుని  మిక్సీ వేసుకోవాలి .

చివరగా  ఒక  20  వెల్లుల్లి  రెబ్బలు  కూడా మిక్సీలో వేసుకుని  మరోసారి  మిక్సీ  వేసుకోవాలి .
 
తర్వాత  ఈ పొడిని  ఒక సీసాలో  భద్రపరచుకోవాలి.

Comments