ఉసిరికాయ తొక్కు రోటిపచ్చడి..


ఉసిరికాయ తొక్కు రోటిపచ్చడి..

కావాల్సిన పదార్దాలు..
పచ్చిశెనగపప్పు-1స్పూన్
ఆవాలు-1 స్పూన్
మినపప్పు-1స్పూన్
ధనియాలు-1 స్పూన్
పచ్చిమిరపకాయలు-10
తొక్కిపెట్టుకున్న ఉసిరికాయ -1కప్

ఉసిరికాయలు బాగా దొరికేటప్పుడే ఎక్కువగా తీసుకొని వాటిల్ని రోటిలో బాగా పసుపు,ఉప్పు వేసి దంచి ఒక సీసాలో పెట్టి ఉంచుకోవాలి..
కావాల్సినప్పుడు పచ్చిమిరపకాయలు,లేదా ఎండు మిరపకాయలు తో కూడా పచ్చడి నూరుకోవచ్చు..

చేసేవిధానం:
అన్ని నూనెలో వేయించుకుని రోటిలో ఒక్కోటి వేసుకుంటూ దంచాలి,పచ్చిమిరపకాయలు దంచెప్పుడు ఉప్పువేసి ఉసిరికాయ తొక్కు ని వేసుకొని దంచి అందులో పోపు పెట్టుకోవాలి..
ఇది అప్పటికప్పుడు చేసుకొని ముద్దపప్పు లో నెయ్యి వేసుకొని అన్నం తింటే అద్భుతంగా ఉంటుంది..

Comments