గుమ్మడికాయ వడియాలు తయారీ



తయారీ  విధానము  మీ  కోసం .

మినపగుళ్ళు  --   250  గ్రాములు 

గుమ్మడికాయ 
లేత దైనా , లేదా 
ముదురు దైనా  
షుమారు     ---   1  K.G  కాయ 

పచ్చి  మిరపకాయలు   ---
                           200  గ్రాములు 
ఇంగువ ----  ముప్పావు స్పూను .

పసుపు  ---  ముప్పావు  స్పూను

ఉప్పు    --   తగినంత 

నూనె   ---   పావు కిలో 

తయారీ  విధానము  ---

రేపు  ఉదయము  భోజనాల లోకి  పచ్చి  వడియాలు  వేసుకుందామనుకుంటే  ముందు  రోజు గుమ్మడి  కాయను  పగుల కొట్టి  సొరకాయ  ముక్కలు  తరిగి నట్లుగా పై చెక్కుతోనే  ముక్కలుగా  తరుగుకొని,   ముక్కలకు  ఉప్పు  , పసుపు  వేసి  ఒక  గుడ్డలో  మూట కట్టి  అందులో  నీళ్ళు  కారి పోయే  విధంగా  పైన  చిన్న  రోలు  కాని , లేదా  బరువు  కానీ  పెట్టుకోవాలి .

మురుసటి  రోజు  ఉదయాని కల్లా ముక్కలలో   నీరు కారిపోతుంది. 

మరుసటి రోజు  పిండిలో  వేయబోయే  ముందు ఒకసారి  ముక్కలను  కూడా  చేతితో  పిండుకోవాలి.  

అలా ముక్కలను  పిండుకుని  నీరు  తీయకపోతే  ,   పిండి  పలుచన  అయి  గారెలు  వేయడానికి   రావు .

మినపగుళ్ళు  కూడా  ముందు  రోజు  నాన బోసుకోవాలి  .

మరుసటి  రోజు  నానిన  పప్పు  శుభ్రంగా  కడిగి  Wet  గ్రైండర్లో  పప్పు  ,  తగినంత  ఉప్పు  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోస్తూ  గారెల  పిండిలా  గట్టిగా  రుబ్బు కోవాలి .

ఇప్పుడు  చాలా    కొంచెం   నీళ్ళల్లో  ఇంగువ  వేసి , స్పూనుతో బాగా  కలిపి ,  ఆ నీళ్ళు  పిండిలో  వేయాలి . ఇలా  ఇంగువ నీళ్ళు  పిండిలో  పవేసి రుబ్బుకుంటే  పిండికి  ఇంగువ వాసన  బాగా  పడుతుంది .

ఇప్పుడు   పిండిని   ఒక  గిన్నెలోకి  తీసుకుని  , గట్టిగా  పిండిన  గుమ్మడికాయ   ముక్కలు  అందులో వేసి  చేతితో   పిండిని  బాగా  కలుపు కోవాలి  .

ముక్కలు  కలిపిన  తర్వాత  కూడా ,  పిండి  గారెల  పిండిలా  గట్టిగానే  ఉండాలి .

పచ్చి మిరపకాయలు   తొడిమలు  తీసుకొని   ముక్కలుగా  కట్  చేసుకొని   మిక్సీలో  మెత్తగా వేసుకుని , తర్వాత  పిండిలో వేసుకుని బాగా  కలుపుకోవాలి .

ఉప్పు  తగ్గినట్లు  అన్పిస్తే  పిండిలో  వేసుకుని  కలుపుకోండి .

భోజనానికి   ముందు  --
******************

స్టౌ  మీద  బాండి  పెట్టి  నూనె  పోసి  నూనె  బాగా  కాగిన  తర్వాత  పిండిని గారెల  మాదిరిగా  వేసుకోవాలి.

ఘుమ  ఘుమ  లాడే  ఇంగువ  వాసన తో  పచ్చి గుమ్మడికాయ   వడియాలు  (  గారెలు  )  భోజనము   లోకి  సిద్ధం .

వేడి వేడి  అన్నంలో  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని  ఈ గారెలను  నంజుకుని  తింటుంటే  ఆ రుచి  అద్భుతం,

Comments