గుత్తి వంకాయయ కురా
గుత్తి వంకాయ కాయల పళంగా
( కొబ్బరి మసాలా కూర . )
కావలసినవి .
చిన్న సైజు నీలం రంగు లేత గుండ్రని వంకాయలు -- అర కిలో
ఎండుమిరపకాయలు -- పది
ఎండు కొబ్బరి -- పావు చిప్ప
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు
చాయ / పొట్టు మినపప్పు ---
రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- మూడు స్పూన్లు
నువ్వుపప్పు --- రెండు స్పూన్లు
ధనియాలు --- మూడు స్పూన్లు
జీలకర్ర --- కొద్దిగా
ఆవాలు -- కొద్దిగా
ఇంగువ -- కొద్దిగా
అల్లం -- చిన్న ముక్క
పెద్ద ఉల్లిపాయ -- ఒకటి .
నూనె --- 100 గ్రాములు .
ఉప్పు -- తగినంత
తయారీ విధానము.
ఎండు కొబ్బరి చిన్న ముక్కలు గా చేసుకోవాలి .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , వేరు శనగ గుళ్ళు , నువ్వుపప్పు , ధనియాలు , ఎండు కొబ్బరి ముక్కలు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించు కోవాలి .
అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఉల్లిపాయ ముక్కలుగా చేసుకోవాలి .
నీళ్ళలో వంకాయలు వేసి గుత్తి వంకాయకూర కనుక నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో వేయించుకున్న మిశ్రమము , అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ మిశ్రమాన్ని వంకాయలలో కూరు కోవాలి .
కొద్దిగా మిశ్రమము విడిగా ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే మసాలా కూరిన వంకాయలను వేసి పైన నీళ్ళ గిన్నె మూత పెట్టి కాయలు చితకకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఈ కూరని బాగా మగ్గనివ్వాలి .
చివరగా విడిగా ఉంచుకున్న మసాలా కూడా వేసి ఇంక మూత పెట్టకుండా మరో ఐదు నిముషాలు ఉంచితే మసాలా కూరకి పట్టి వంకాయలు కూడా బాగా మగ్గుతాయి . కారం వేగినట్లు చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది.
ఆ తర్వాత దింపి వేరే Dish లోకి తీసుకోవాలి .
అంతే . ఘుమ ఘుమ వాసనలతో వంకాయ కొబ్బరి మసాలా కూర భోజనము లోకి , రోటీల లోకి మరియు చపాతీల లోకి సర్వింగ్ కు సిద్ధం .
.
Comments
Post a Comment