వంకాయ ఉల్లికారం కాయలపళంగా

వంకాయ ఉల్లికారం  కాయలపళంగా.

తయారీ  విధానము .

అరకిలో  వంకాయలను  తీసుకోవాలి .

మూడు  పెద్ద ఉల్లిపాయలను  పై పొట్టు తీసి , ముక్కలుగా  తరుగుకోవాలి.

స్టౌ మీద బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె  బాగాకాగగానే , పన్నెండు ఎండు మిరపకాయలు  , రెండు  స్పూన్ లు పచ్చిశనగపప్పు  , స్పూనున్నర  చాయ మినపప్పు  , పావు స్పూన్  ఆవాలు  వేసుకొని  పోపును  వేయించుకోవాలి. పోపు వేగగానే  తరిగిన  ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకుని, అందులో  పావు స్పూను  పసుపు  వేసుకుని  ,   ఓ ఐదు నిముషాలు  ముక్కలు  మగ్గనివ్వాలి.

పోపు చల్లారగానే  ఈ పోపు  మిశ్రమము మొత్తము మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  మిక్సీలో  కొద్దిగా  పప్పులు  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  వంకాయలను  నాలుగు  పక్షాలుగా  చేసుకుని , ఈ మిశ్రమమును  కాయలలో  కూరుకోవాలి. కొంత  ఉల్లికారమును  విడిగా  ఉంచుకోవాలి.

స్టౌ మీద  గిన్నె పెట్టుకుని  ఓ ఎనిమిది  స్పూన్లు  నూనె వేసుకుని  , నూనె  బాగా కాగగానే  కారం కూరిన వంకాయలను  వేసుకుని  ఓ పది నిముషాలు  కాయలను మగ్గనివ్వాలి.

తర్వాత  విడిగా  ఉంచుకున్న మిగిలిన ఉల్లికారమును  వేసుకుని  మరో ఐదు నిముషాలు   కారము ముక్కలలో  కలసి పోయేలా  మగ్గ నిచ్చి , దింపుకుని   ఒక ప్లేటులోకి  తీసుకోవాలి .

ఎంతో రుచిగా  ఉండే  వంకాయ ఉల్లికారం  కాయల పళంగా  కూర  సర్వింగ్ కు సిద్ధం.

Comments