తియ్య గుమ్మడితో కూర


తియ్య  గుమ్మడితో  కూర .

మంచి  గుమ్మడి  (  తియ్య  గుమ్మడి ) ఎలా  వండినా  తీపి  తగుల్తుంది .
గుమ్మడి  కాయలో  అర ముక్క తీసుకుని  పై చెక్కు తీసి   కాస్త  పెద్ద  ముక్కలుగా  తరుగుకోండి .
అర  కప్పు  కందిపప్పు   కాస్త  బద్దలుగా  ఉడక పెట్టుకోండి  .

స్టౌ  మీద  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె  వేసి  నాలుగు  ఎండుమిర్చి   ముక్కలుగా  చేసి , స్పూను   మినపప్పు , పావు స్పూను  జీలకర్ర  , అర స్పూను  ఆవాలు ,  కొద్దిగా   ఇంగువ ,  రెండు  రెమ్మలు కరివేపాకు  , నాలుగు  పచ్చిమిర్చి  తరిగిన  ముక్కలు  వేసి  పోపు  వేగగానే   మంచి  గుమ్మడి  ముక్కలు , ఉడికించిన  కందిపప్పు  , తగినంత  ఉప్పు , స్పూను  కారం  వేసి  మగ్గగానే  దింపుకోండి  .

కొంతమంది  పచ్చి  శనగపప్పు  ఉడకపెట్టుకుని  గుమ్మడి కాయ ముక్కలు  మరియు  ఉడికిన పచ్చి శనగపప్పు  పోపులో వేసుకుని  ఉప్పు కారం  పప్పు కూర  చేసుకుంటారు .

కొంతమంది  కూరలో  కొద్దిగా  చింతపండు రసము మరియు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కూర చేసుకుంటారు .

గుమ్మడికాయ  ముక్కలు  పోపులో  వేయగానే  మగ్గి పోతాయి.  విడిగా  ఉడక పెట్టనవసరం లేదు.

Comments