శనగపిండి ఉల్లిపాయల కూర పొడి.తయారీ విధానము.
శనగపిండి ఉల్లిపాయల కూర పొడి.
తయారీ విధానము.
ముందుగా నాలుగు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
ముప్పావు కప్పు లేదా 50 గ్రాముల శనగపిండి తీసుకోవాలి . అందులో పావు స్పూను జీలకర్ర , తగినంత ఉప్పు , రెండు స్పూన్లు కారం వేసి చేత్తో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు బాండీలో నాలుగు స్పూన్లు నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే ముక్కలుగా తరిగి ఉంచిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .
ముక్కలు వేగగానే జీలకర్ర , ఉప్పు మరియు కారం కలిపిన శనగపిండిని వేసి , శనగపిండి పచ్చి వాసన పోయి ఉల్లిపాయల తో కలసి కమ్మని వాసన వచ్చేదాక వేయించుకోవాలి .
ఇప్పుడు వంకాయలు మరియు క్యాప్సికమ్ అయిన పక్షంలో కాయలను కాయల పళంగా నాలుగు పక్షాలుగా చేసుకోవాలి.
అదే కాకరకాయలు అయిన పక్షంలో కాయలను చాకుతో మధ్యలో గాటు పెట్టు కోవాలి.
వీటిని ముందుగా నూనెలో వేయించుకోవాలి. వేయించగానే ఈ మిశ్రమాన్ని వేయించిన కాయల్లో కూరుకోవాలి .
విడిగా కొంత వేయించిన పొడి ఉంచుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి నూనెపోసి నూనె పొగలు రాగానే ఒక్కో కాయలో రెండు స్పూన్లు వేడి నూనె పోసుకోవాలి.
అంతే కాకరకాయ , వంకాయ లేదా క్యాప్సికమ్ తో శనగపిండి మరియు ఉల్లిపాయ కూర సర్వింగ్ కు సిద్ధం.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని విడిగా ఉంచిన కూరపొడి కలుపుకుని శనగపిండి ఉల్లిపాయలతో కూరిన కాయల పళంగా చేసిన కూరను కలుపుకుని తింటుంటే ఆహా ఏమి రుచి . అనరా మైమరచి.
Comments
Post a Comment