భోజనం ఎలా చేయాలి ??సంప్రదాయం పద్ధతిలో

ప్రియమిత్రులందరికీ   శుభోదయవందనములు  .

భోజనము   ఏ  విధంగా  చేయాలి ?

భోజన విధి 

1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి.
2.తూర్పు, దక్షిణ,పడమర ముఖంగా కూర్చుని తినాలి. 
3.మోదుగ,అరటి,పనస,మేడి ఆకులలో భోజనం ఉత్తమం 
4.ఎడమవైపుగా కొస ఉండాలి.
5 . ఆకును నీటితో కడిగి మండలంపై ఉంచి వడ్డన చేయాలి.
6.ఎదురుకుండా కూరలు తరువాత మధ్యలో అన్నం,కుడివైపు పాయసం,పప్పు ఎడమవైపు పిండివంటలు చారు లేక పులుసు , చివర పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి.
అన్ని వడ్డన అయ్యాక నెయ్యి వడ్డన చేయాలి.
7.ఆజ్య అభిఘారం లేకుండా అన్నము తినరాదు.
8.'త్రిసుపర్ణం' గాని 'అహంవైశ్వానరో భూత్వా '
మొదలగునవి పఠించవలయును.
9 చేతిలో నీరు గ్రహించి గాయత్రీ మంత్రముచే అన్నము పరిషేచన చేయవలెను. 
10.తర్జనీ మధ్యమ అంగుష్ఠములచేత ఎదుటభాగం నుండి ఓం ప్రాణా...స్వాహా అని ఆహుతి గ్రహించవలేను 
11.మధ్యమ,అనామిక,అంగుష్ఠములచేత దక్షిణభాగం నుండి ఓం అపానా...స్వాహా అని
12.కనిష్ఠ, అనామిక అంగుష్ఠములచేత 
పడమర భాగం నుండి ఓంవ్యాన..స్వాహాఅని
13.కనిష్ఠికా తర్జనీ అంగుష్ఠములచేత ఉత్తరభాగం నుండి ఓం ఉదానా.. స్వాహా అని
15 అన్ని వేళ్ళు కలిపి మధ్యభాగం నుండి ఓం సమానా...స్వాహా అని ప్రాణాహుతులు దంతములకు తగలకుండా ఇవ్వవలయును. 
16.ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనము గృహస్తు చేయవలెను. 
17 . మౌనంగా భోజనం చేయవలెను. 
18.భోజనకాలమందు మంచినీరు కుడిభాగమందు ఉంచవలెను. 
19.భోజనకాలమందు జలపాత్రను కుడిచేతి మణికట్టుపై ఉంచి ఎడమ చేతితో పట్టుకొని త్రాగవలయును. 
20.భోజనం చేయుచూ పాదములు ముట్టుకొనరాదు. 
21.చిరిగిన ఆకులో తినరాదు.
22.చెప్పులతోను?,మంచాలపైన, చండాలురు చూస్తూ ఉండగా భోజనం చేయరాదు.
23.భోజనం అయిన పిదప చేతిని కడుగుకొని 
నీరు పుక్కిలించి పాదప్రక్షాళన చేయవలెను. 
24.భోజనమునకు ముందు వెనుక ఆచమనం చేయవలయును.

సేకరణ .

Comments